నేడు రాయలసీమలో మోస్తరు వానలు

9 Dec, 2020 07:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం/పాడేరు/అరకులోయ: ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకూ విస్తరించి ఉంది. మరోవైపు మన్నార్‌ గల్ఫ్‌ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం క్రమంగా బలహీనపడింది. ఈ ప్రభావంతో నేడు రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. కోస్తాంధ్రలో మాత్రం పొడి వాతావరణం ఉంటుంది. విశాఖ ఏజెన్సీ వ్యాప్తంగా చలిగాలులు విజృంభిస్తున్నాయి. మంగళవారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచు కూడా దట్టంగా కురుస్తోంది. సంతలకు వెళ్లే గిరిజనులు చలి తీవ్రతతో వణికిపోతున్నారు. 

మరిన్ని వార్తలు