గోరుముద్దలో రాగిజావ

22 Mar, 2023 02:06 IST|Sakshi

రాయచోటి : జగనన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు మరో పౌష్టికాహారం రాగిజావా అందించే కార్యక్రమం చాలా అద్భుతమైనదని కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ తెలిపారు. రాగి జావా అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ గిరీషా పీఎస్‌, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, డీఈఓ పురుషోత్తం, ఏపీఐఐసీ డైరెక్టర్‌ శ్రీనివాసులురెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఉమామహేశ్వరమ్మ, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో ఇప్పటికే సమూల మార్పులు చేపట్టి జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతి రోజూ రుచికరమైన మెనూతో బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని ప్రభు త్వం అమలుచేస్తుందన్నారు. ఐరన్‌, కాల్షియం లాంటి పోషకాలు అందించి.. విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు బెల్లంతో కూడిన రాగిజావను అందించే మంచి కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల్లో సామర్థ్యం మెరుగుపరిచి, డ్రాపౌట్స్‌ను తగ్గించేందుకు మధ్యాహ్న భోజనంలో రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తోందన్నారు. వీటన్నింటినీ విద్యార్థులు బాగా సద్వినియోగం చేసుకొని, బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని కలెక్టర్‌ సూచించారు.

జగనన్న గోరుముద్దలోమరో పౌష్టికాహారం

జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌

మరిన్ని వార్తలు