ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షకు 96.22 శాతం హాజరు

22 Mar, 2023 02:06 IST|Sakshi
ముగ్గురు విద్యార్థులు డిబార్‌

కడప ఎడ్యుకేషన్‌: ఉమడ్మి జిల్లావ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షకు 96.22 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 92 పరీక్ష కేంద్రాలలో గణితం, బాటనీ, సివిక్స్‌ పరీక్షలకు 22,088 మంది విద్యార్థులకుగాను 21,255 మంది హాజరుకాగా 833 మంది గైర్హాజరయ్యారు. కమలాపురంలోని వేరు వేరు పరీక్షా కేంద్రాలలో ఇద్దరు, బ్రహ్మంగారిమఠం పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థిని డీబార్‌ చేసినట్లు ఆర్‌ఐఓ రమణరాజు తెలిపారు. కడప నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను ఇంటర్‌బోర్డు పరిశీలకుడు జేవీ రమణ తనిఖీ చేశారు. ఆర్‌ఐఓ రమణరాజు బద్వేల్‌, బ్రహ్మంగారిమఠం ప్రాంతంలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు ప్రకాష్‌, వెంకటసుబ్బయ్య, ప్రసాద్‌వర్మలు పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రవి ఆర్‌ఐఓ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ స్ట్రీనింగ్‌ ద్వారా పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించి అధికారులు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు.

మరిన్ని వార్తలు