● వీరభద్రుడి పల్లకీ సేవ

22 Mar, 2023 23:56 IST|Sakshi
పల్లకీలో ఊరేగుతున్న శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి

రాయచోటి టౌన్‌ : శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి వారికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూల విరాట్‌లను ప్రత్యేకంగా రంగు రంగు పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి భక్తుల దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే ఉత్సవ మూర్తులకు కూడా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీలో ఉంచి మాడ వీధులలో ఊరేగించారు. స్వామిని దర్శించుకోవడానికి స్థానిక భక్తులతో పాటు కన్నడ భక్తులు కూడా పాల్గొన్నారు.

గండిలో గ్రామోత్సవం

చక్రాయపేట : గండి క్షేత్రంలో వెలసిన వీరాంజనేయస్వామి సన్నిధిలో ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ పఠనం వైభవంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఒంటె వాహనంతో కూడిన రథంపై గండి పురవీధుల్లో ఊరేగించారు. ఈవేడుకల్లో ఆలయ చైర్మన్‌ రాఘవేంద్రప్రసాద్‌, ఆలయ ప్రధాన, ఉపప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్‌, రాజగోపాలాచార్యులు, వేంపల్లె జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలు

బ్రహ్మంగారిమఠం : తోట్లపల్లె అచలానంద ఆశ్రమం పీఠాధిపతి విరజానంద స్వామి ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైన వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ గ్రామోత్సవం లింగాలదిన్నెపల్లె వరుకు చేరుకుంది. స్వామి గ్రామోత్సవం వస్తుందని తెలుసుకున్న గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో విరజానందస్వామి, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు