-

ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వ ప్రోత్సాహం

28 Nov, 2023 02:24 IST|Sakshi
సేంద్రీయ పంటలను అంతర్జాతీయ బృందంతో కలిసి పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

చిన్నమండెం : ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వైఎస్సార్‌సీపీ రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పంటల పరిశీలనలో భాగంగా లావోవోస్‌, భారత్‌, కెన్యా, జింబాబ్వే, సెనెగల్‌, ట్యునీషియా, పెరూ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు , పరిశోధకులు చిన్నమండెం సమీపంలో ఏపీసీఎన్‌ఎస్‌ ప్రాజెక్టు ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించారు. అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు పొందిన సిరాడ్‌, వరల్డ్‌ ఫిష్‌, అలయన్స్‌, బయోడైవర్సిటీ, ఓఈపీ, ఇనేరా సంస్ధల ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. సేంద్రియ పంటలను అంతర్జాతీయ బృందంతో కలిసి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ దేవనాథరెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి , రసాయన వ్యవసాయాల మధ్య తేడాలను వివరించారు. జగనన్న ప్రభుత్వం డ్రిప్‌ ఇరిగేషన్‌కు 80 నుంచి 90శాతం వరకు సబ్సీడీ అందిస్తోందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు. జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ దేవనాథరెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పంటల వాడకం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. రైతు సాధికారిక సంస్థ అధికారులు చంద్రశేఖర్‌, టీం లీడర్‌ ధర్మేంద్ర, జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ రామకృష్ణమరాజు,అడిషనల్‌ ప్రాజెక్టు మేనేజర్‌ యశోదమ్మ, వైస్‌ ఎంపీపీ ఏజాస్‌ అలీఖాన్‌, సర్పంచ్‌ నజీర్‌ అహమ్మద్‌, షారుల్లా, జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు చుక్కా అంజనప్ప, బురాన్‌ఖాన్‌, అజ్రూ, నాగశేషారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు