నాపరాయి గనుల్లో రజనీకాంత్‌ షూటింగ్‌

31 Jan, 2024 09:41 IST|Sakshi
ఫైట్‌ సీన్‌ చిత్రీకరణ కోసం వస్తున్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌

యర్రగుంట్ల : మండలంలోని నిడుజివ్వి గ్రామ పరిధిలోని నాపరాయి గనులలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న వెట్టయన్‌ (వేటగాడు) సినిమా షూటింగ్‌ మంగళవారం జరిగింది. లైకా ప్రొడక్షన్‌ సారథ్యంలో రజనీకాంత్‌ 170వ సినిమాను దర్శకుడు టీజే జ్ఙానవేల్‌ రూపొందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ విలన్‌తో మాట్లాడి ఫైట్‌ చేయడం చిత్రీకరించారు. అభిమానుల తాకిడి అధికంగా ఉండటంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, రజనీకాంత్‌కు సమీప సిమెంట్‌ పరిశ్రమ గెస్ట్‌హౌస్‌లో బస ఏర్పాటు చేశారు.

whatsapp channel

మరిన్ని వార్తలు