ఐదు శతాబ్దాల బురుజు.. అయినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు!

7 Oct, 2021 21:22 IST|Sakshi

వైఎస్సార్‌ జిల్లా (పులివెందుల రూరల్‌): పులివెందుల మండల పరిధిలోని ఎర్రబల్లె పంచాయతీలోని నల్లగొండువారిపల్లె గ్రామంలో 5 శతాబ్దాల నాటి బురుజు నేటికి చెక్కు చెదరకుండా ఉంది. పూర్వం బ్రిటీష్‌ కాలంలో శత్రువులు దాడులు చేసినప్పుడు వారి నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు బురుజులు ఏర్పాటు చేశారని గ్రామస్తులు అంటున్నారు. అంతేకాక పంట ఉత్పత్తులను ఈ బురుజులలో గోప్యంగా దాచి ఉంచేవారు. ఇప్పటికి పలు గ్రామాలలో పాతకాలం నాటి బురుజులు దర్శనమిస్తున్నాయి. ఈ బురుజుల గురించి ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. 

చదవండి: శిథిలావస్థలో అపూర్వమైన కట్టడాలు

మరిన్ని వార్తలు