ఇదీ ఆ ఊరు కథ.. నెల్లి అంటే ఉసిరిక, నెల్లు అంటే వడ్లు!

8 Oct, 2021 12:05 IST|Sakshi
నెల్లూరు సూచిక బోర్డు

నెల్లూరు సిటీ: నెల్లూరంటేనే మంచి ధాన్యం, నాణ్యమైన నాగరికత, పెన్నానదీ, ఆ నదీతీరాన వెలసిన రంగనాయకులస్వామీ గుర్తుకు వస్తారు. ఒకప్పుడు ఇదీ దండకారణ్యంలో ఒకభాగం. సింహాలు ఎక్కువగా ఉండేవని, అందువల్ల సింహాపురి అనే పేరు వచ్చిందని ఒక వాదన. నెల్లూరును ఎక్కువ కాలం పాలించిన పల్లవులకు ‘సింహా’ అనే బిరుదు ఉండేది. అందువల్ల ‘సింహాపురి’ అనే పేరు వచ్చిందనేది ఇంకో వాదన. బృహత్పల్లవుల్లో మొదటివాడైనా సింహవిష్ణువు తన పేరిట విక్రమ సింహపురాన్ని నిర్మించారనేది ఒక అభిప్రాయం.


నెల్లూరు నగర వ్యూ

ముక్కంటి రెడ్డి అనే అతడు ఒకప్పుడు ఈ ప్రాంతానికి నాయకుడిగా ఉండేవారు. అతడికి ఒకరోజు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆ ప్రాంతంలో ఉసిరిక చెట్టు కింద గల శివలింగానికి ఆలయం కట్టించవలసిందిగా కోరాడు. ముక్కంటి రెడ్డి ఆలయం కట్టించి నిత్యోత్సవాలు జరిగే ఏర్పాటు చేశారు. ఆ ఆలయమే ఇప్పుడు మూలాపేటలో ఉన మూలస్థానేశ్వరాలయం.
(చదవండి: స్టోన్‌హౌస్‌పేట.. ఆ కలెక్టర్‌ చేసిన సేవలకు గుర్తింపుగా)


నెల్లూరు నగర వ్యూ

అప్పట్లో నెల్లూరు పట్టణం మూలాపేట, రంగనాయకులపేట, సంతపేట, దర్గామిట్టలకు పరిమితమై ఉండేది. ‘నెల్లి’ అంటే ఉసిరిక చెట్టుగనుక ఆ విధంగా నెల్లూరు అనే పేరు వచ్చిందంటారు కొందరు. పినాకినీ నదీ తీరాన ఈ నగరం ఉండడంతో, వరి పంటకు ప్రసిద్ధి. నెల్లు అంటే వడ్లు గనుక వడ్లు ఎక్కువగా పండే ప్రాంతం కాబట్టి నెల్లూరు అనే పేరు వచ్చిందంటారు మరికొందరు. నెల్లూరు పట్ల ఇన్నీ రకాల అభిప్రాయాలు ఉండడం విశేషం.
(చదవండి: AP Special: ప్రోత్సహిస్తే ఇత్తడి భవిత బంగారమే!)

మరిన్ని వార్తలు