Gandikota: ప్రకృతి సోయగాల కోట.. గండికోట

7 Oct, 2021 12:24 IST|Sakshi

వైఎస్సార్‌ జిల్లా (జమ్మలమడుగు): ప్రకృతి సోయగాల కోట.. గండికోట. 11వ శతాబ్దం నాటి చారిత్రక చరిత్ర కలిగిన గండికోటలో నేడు పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. నాటి వైభవానికి ప్రతీకగా నిలిచిన నిర్మాణాలు, కోటలోపల ఎన్నో ఉన్నాయి. దానితో పాటు చారిత్రక వైభవాన్ని గురించి కళాత్మక శిలా సంపద కూడ కనువిందు చేస్తుంది. శత్రు దుర్భేధ్యమైన ఈ కోటకు మూడు వైపుల పెన్నానది లోయ, ఎత్తైన కొండలు వ్యాపించి ఉన్నాయి.

శత్రువులు గండికోటకు తూర్పువైపు నుంచి నేరుగా రావల్సి ఉంది. దీంతో శత్రువులను కిలోమీటర్ల దూరం నుంచి పని పట్టేటందుకు కోట చుట్టూ ప్రహారి గోడ నిర్మాణం చేపట్టి ఫిరంగి గుండ్ల ద్వార శత్రువులపై దాడి చేసేందుకు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి నీటి విడుదల చేయడంతో పెన్నానది లోయలో నీటితో కళకళలాడుతుంది.

దీంతో లోయ సుందరమైన దృశ్యం కనువిందు చేస్తుంది. సెప్టెబర్, అక్టోబర్, నవంబర్‌ నెలల్లో విపరీతమైన వర్షాలు పడటంతో స్థానికంగా ఉన్న వంకలు పొంగి పోర్లడంతోపాటు కొండపై నుంచి వాటర్‌ ఫాల్స్‌ పడుతుండటంతో పర్యాటకులు విపరీతంగా పెరిగిపోయారు. కరోనా కారణంగా కుదేలైన పర్యాటక రంగం ఇప్పుడిప్పుడు ఈ ప్రాంతంలో పర్యాటకుకలతో సందడి నెలకొంటుది. అంతేకాకుండ గండికోట అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.


 

మరిన్ని వార్తలు