1905లో నాటారు.. ఇప్పటికీ చెక్కుచెదరకుండా

14 Oct, 2021 11:47 IST|Sakshi
వేటపాలెం పిహెచ్‌సీ ముందు 116 ఏళ్ల నాటి మర్రి మహావృక్షాలు

వేటపాలెం:  ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలోని ప్రాథమి ఆరోగ్య కేంద్రం వద్ద గల శతాబ్థాల చరిత్ర గల మర్రివృక్షం ఇప్పటికి చెక్కుచెదర కుండా ఉంది. ఈ వృక్షానికి ఇక చరిత్ర ఉంది. 1904 సంవత్సరంలో జెయంజే సంస్థకు చెందిన నలుగురు కన్యాస్త్రీలు వేటపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేదలకు వైద్యం చేస్తు వాటితో పాటు సామాజిక సేవలు చేసేవారు. అప్పటిలో వారు వైద్యశాలకు వచ్చే రోగులకు నీడ కోసం 1905 సంవత్సరంలో మే 1వ తేదీన వైద్యశాల ముందు మర్రి చెట్టు మొక్కలు రెండు నాటారు. 

అనంతరం వారు 1911 మే 11వ తేదీన వరకు వైద్యశాల్లో సేవలు అందించారు. అనంతరం సంస్థ కార్యకలాపాలు చీరాల మార్చడం జరిగింది. అప్పడు వారు నాటిన మర్రి మొక్కలే నేడు మహవృక్షాలుగా నేటికీ ఉన్నాయి. శతాబ్థాల చరిత్ర గల ఈ మర్రి వృక్షాలను కాపాడుకోవడం తోపాటు అవి చిరస్మరణీ యంగా నిలువాలని సంస్థ వాటికి రక్షణ కోడలు నిర్మించి రోగులు సేద తీరడానికి వృక్షాల చుట్టూ అరుగులు ఏర్పాటు చేశారు. 2019 సంవత్సరంలో సంస్థ ప్రతినిధులు బెంగుళూరు నుండి వేటపాలెం వచ్చి రూ.10 లక్షల ఖర్చుతో పార్కును ఏర్పాటు చేసి సుందరంగా అలకంరించారు. ఈ వృక్షాలు దశాబ్థాల చరిత్రను తెలియజేస్తున్నాయి.

మరిన్ని వార్తలు