దేశంలో ఏకైక పంచ బ్రహ్మలింగేశ్వర ఆలయం

6 Oct, 2021 10:45 IST|Sakshi

రెండో అతిపెద్ద ఏకశిలా ధ్వజస్తంభం

పంచబ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం ఎదుట ప్రతిష్టించిన  68 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం

ఆలయంలో పంచబ్రహ్మలతో ప్రతిష్టించిన శివలింగం

కోవెలకుంట్ల: కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలోని భీమునిపాడులో  వెలసిన పంచబ్రహ్మలింగేశ్వర ఆలయం దేశంలోనే ఏకైక ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. వినాయకుడు, ఈశ్వరుడు, అమ్మవారు, విష్ణువు, బ్రహ్మ పూర్ణంగా(పంచబ్రహ్మలు) శివలింగాన్ని ప్రతిష్టించారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పండుగ రోజున దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నది జలాలతో పంచబ్రహ్మలింగేశ్వరుడికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఒక్కో సంవత్సరం ఒక్కో నది నుంచి  క్యానులో 25 లీటర్ల చొప్పున ఆరు క్యాన్లతో నది జలాలను తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నారు. 

ఇప్పటి వరకు గంగ, యమున, కృష్ణ, గోదావరి, కావేరి, నర్మద నదుల నీటితో అభిషేకం  నిర్వహించారు. అలాగే ఆలయం ఎదుట 14 సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన 68 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం దేశంలోనే రెండవ అతిపెద్ద ధ్వజస్తంభంగా పేరుగాంచింది. కర్నాటక రాష్ట్రంలోని హోస్పెట్‌ నుంచి ఏకశిలా రాతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. దేశంలో అతిపెద్ద ఏకశిలా విగ్రహం కర్నాటక రాష్ట్రంలో ఉండగా రెండవది ఆంధ్రప్రదేశ్‌లోని భీమునిపాడులో ప్రతిష్టించడం విశేషం.

మరిన్ని వార్తలు