AP Special: పాములలో గుండె కదులుతూ ఉంటుందా..!?

5 Oct, 2021 21:18 IST|Sakshi

ఆత్మకూరురూరల్‌:పాము కనిపిస్తే చాలు మన గుండె వేగం పెరగడం ,రక్తం వడవడిగా పరుగులెత్తడం సాధారణమే. మన గుండె ఒకే చోట ఉంటుంది. పాము విషయానికి వస్తే అలా కాదు. పాము గుండె పరిస్థితులను బట్టి తన శరీరంలో గుండెను మార్చుకుంటూ ఉంటుంది. వేగంగా కదిలే పాము చెట్లను ఎక్కుతున్న పుడు,తన పరిమాణానికి మించిన  ఆహార జంతువును   మింగుతున్నపుడు గుండె ఒకే చోట ఉంటే అది ఒత్తిడికి గురి అవుతుంది? అలాంటి సందర్భంలో పాము ఎలా అధిగమిస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇటీవల కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని బైర్లూటిలో  పాములపై జరిగిన ఒక వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఎన్‌ఎస్‌టిఆర్‌(నాగార్జున సాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌)వన్యప్రపాణుల వైద్యు నిపుణుడు డాక్టర్‌ ఆచార్య పాముల గురించి కొన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించారు.  డాక్టర్‌ ఆచార్య మేరకు పాములలో గుండె స్థిరంగా ఒక చోట ఉండదు. సాధారణంగా పాములను మూడు భాగాలుగా విభజిస్తే తల ఉన్న ప్రాంతంలో మెదడు, నాలుక,కోరలు, విషగ్రంధులు ఉంటాయి.

మధ్యభాగంలో గుండె, చిన్న ప్రేగులు, తోక ప్రాంతంలో పెద్దప్రేగులు ఉంటాయి. అయితే పాములు తమ పరిమాణానికి మించిన జంతువులను మింగుతుంటాయి. ఉదాహరణకు కొండ చిలువలు మేకలను జింకలను మింగుతాయి. అలాగే నాగుపాములు పెద్ద ఎలుకలను మింగుతుంటాయి. పాములకు దంతాలు లేనందున ఆహారాన్ని నమిలి తినలేవు. యథాతధంగా ఫలానా జంతువును మింగినప్పుడు అనివార్యంగా పాము శరీరాన్ని రబ్బరులా సాగతీస్తుంది. ఈ సమయంలో పాము అంతర్భాగమంతా తాను మింగిన జంతువుతో నిండి పోతుంది.

అపుడు గుండె ఒక చోట స్థిరంగా ఉంటే అది ఆహార జంతువు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ సమయంలో పాము గుండె దాని తోక వైపు పయనిస్తుంది. ఆహారపు జంతువు జీర్ణమవగానే తిరిగి యథాస్థానానికి చేరుకుంటుంది. అలాగే  పాములు వేగంగా చెట్లను ఎగబాకేటపుడు పూర్తిగా ఏటవాలుగా అవ్వడంతో అవసరమైన రక్తాన్ని పాము మెదడుకు పంప్‌ చేయడానికి గుండెకు కష్టమవుతుంది. ఈ స్థితిలో కూడా పాము గుండె పాము తలబాగానికి ప్రయాణం చేసి పాము మెదడుకు సులువుగా రక్తాన్ని పంప్‌ చేయగలుగుతుంది. 
చదవండి: అంతరిక్షంలోనూ అమోఘం

మరిన్ని వార్తలు