Tirupati: శ్రీవారు స్వయంగా ప్రతిష్టించిన ఆలయం.. అందుకే ఆ గుడి ప్రత్యేకం

9 Oct, 2021 18:49 IST|Sakshi

ఆరోగ్య ప్రదాతగా భక్తుల విశ్వాసంతో నిత్యం పూజలు

పద్మావతి,శ్రీనివాసుని పరిణయ ఘట్టంలో అనుసందాన కర్తగా సూర్య నారాయణ మూర్తి

సాక్షి, చిత్తూరు: తిరుపతి సమీపంలోని తిరుచానూరులో సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. శ్రీ పద్మావతి అమ్మ వారు ఆలయంలోని ఉప దేవాలయంలో ఇది కూడా ఒకటి. అమ్మవారి దేవాలయం వెనుకభాగంలోని పుష్కరిణికి ఎదురుగా ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు, తిరుచానూరు అమ్మవారి దర్శించుకున్న తర్వాత శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

సూర్య నారాయణ స్వామి ఆలయ పురాణం
తిరుచూనూరు క్ష్రేత్రం శిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అనుగ్రహించిన పవిత్ర క్ష్రేత్రం. లక్ష్మీదేవి వ్యూగంతో భూలోకానికి విచ్చేసిన శ్రీ వేంకటేశ్వరుడు మహాలక్ష్మీ కోసం 12 ఏళ్లపాటు తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఆ సమయంలోలక్ష్మీదేవి స్వరూపమైన శ్రీ పద్మావతి దేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని నిర్మించారు. శ్రీవారు దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలు ఆ కొనలులో ప్రతిష్టించారు.  శ్రీ హరి సరస్సులో పద్మాలను నాటారు. సరస్సు తూర్పు ఒడ్డున, శ్రీ హరి సూర్యుడిని (సూర్య నారాయణ స్వామి) ప్రతిష్టించాడు.

వెయ్యి బంగారు తామర పువ్వులను సమర్పించి పూజించాడు. 12 సంవత్సరాల పాటు పూజించిన తర్వాత, కార్తీక సుధ పంచమి నాడు, మహా లక్ష్మీ దేవి బంగారు పద్మం నుంచి తామరలా ప్రకాశిస్తుంది. ఆ పద్మాల వికాసానికి మూలం సూర్య కిరణాలు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్టించిన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సూర్య నారాయణ స్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైకానస ఆగముక్తంగా అర్చన, పూజా కార్యాక్రమాలు నిర్వహిస్తుంటారు. సూర్య నారాయణ స్వామి ఆలయంలో ముఖ మండపం ,అర్థ మండపం, గర్భాలయంగా మూడు భాగాలుగా నిర్మించారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉండదు. పద్మావతి అమ్మవారు, శ్రీవారి పరిణయ సమయంలో శ్రీ సూర్య నారాయణ మూర్తి అనుసంధాన కర్తగా వ్యవహరించిన నేపధ్యంలో  శ్రీనివాసుడి అవతార కధా ఘట్టంలో ఎనలేని ప్రాదాన్యత ఉంది. 

సూర్య నారాయణ స్వామి అభిషేక సేవలు
స్వామి వారికి ప్రతి ఆదివారం పంచామ్రుత అబిషేక సేవలు నిర్వహిచండం ఆనవాయితీ. ప్రతి నెల స్వామి వారి జన్మ నక్షత్రంమైన హస్తా నక్షత్రం రోజున ఆలయంలో ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరుమాడ వీధుల్లో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రధాత అనుగ్రహం పొందుతారు. ధనుర్‌మాసం, రథ సప్తమి రోజుల్లో విశేష పూజలు ఆలయంలో నిర్వహిస్తారు. ఆలయంలో పూజా, వేద మంత్రాలతో సూర్యనారాయణ స్వామికి అభిషేకం చేస్తారు.

పూజ ముగింపులో, ఈ పూజలో పాల్గొనే భక్తులకు తీర్థం (స్వామి అభిషేకం సమయంలో సేకరించబడింది), ప్రసాదం, పువ్వులు ఇస్తారు. స్వామి వారికి సమర్చించిన అరటి పండ్లు, తులసి, ఆఫిల్, తదితర పండ్లను ఆలయం వెలుపలి భాగంలోని గోవులకు ఆహారంగా అందిస్తారు. ఆ ద్వారా గోమాతను పూజిస్తూ ,గోమూత్రాన్ని సేకరించి తమ ఇంట్లో చల్లుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం .

సూర్యనారాయణ స్వామి అభిషేకంతో ప్రయోజనాలు
►కుటుంబ శ్రేయస్సు కోసం, ప్రశాంతమైన మనస్సు, సూర్యుని గ్రహ స్థానం బలాన్ని మెరుగుపరచడానికి.
►వివాహం ఆలస్యం అవుతోంది అన్న భావన కలిగిన భక్తులు స్వామికి అభిషేకం చేయిస్తే  వివాహాది కార్యాలు త్వరితగతిన అవుతాయి.
►జంటలు పిల్లలకు ఈ పూజ చేస్తారు. పెళ్లి అయిన స్త్రీలకు త్వరగా గర్బధారణ అవుతుందని భక్తుల విశ్వాసం.
►ఉద్యోగ,వ్యాపారం,ఆస్తుల క్రయ,విక్రయాల్లో అభివృద్ది కోసం వ్యక్తులు ఈ పూజ చేస్తారు.

చదవండి: Nagari Hills: నగరికి ఆ పేరు.. దీని వెనుక ఇంత కథ ఉందా!

మరిన్ని వార్తలు