దేశంలోనే ‘అత్యంత మహిమానిత్య క్షేత్రం’ శ్రీశైలం

6 Oct, 2021 02:54 IST|Sakshi

 జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలసి ఉన్న క్షేత్రం శ్రీశైలం ఒక్కటే

శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠం కలగలసి ఉన్న మహాక్షేత్రం శ్రీశైలం ఒక్కటే. ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో మూడు ప్రాంతాల్లోనే శక్తిపీఠం, జ్యోతిర్లింగం కలిసి ఉన్నాయి. కానీ శ్రీశైల క్షేత్రంలో మాత్రమే ఒకే ప్రాంగణంలో శక్తిపీఠం, జ్యోతిర్లింగం రెండు కలగలసి ఉన్నాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత మహిమానిత్యక్షేత్రంగా శ్రీశైలం విరాజిల్లుతుంది. అందుకే ఈ క్షేత్రానికి నిత్యం భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగాణం మొత్తం మారుమోగుతుంది. 

ద్వాదశ జ్యోతిర్లింగాలు మొత్తం 12 ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాలు 18 ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నా, కేవలం మూడు ప్రాంతాల్లోనే జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉన్నాయి. జ్యోతిర్లింగ స్వరూపుడు మల్లికార్జున స్వామి, శక్తిపీఠం భ్రమరాంబాదేవి కొలువైంది ఒకచోటనే. అలాగే జ్యోతిర్లింగ స్వరూపుడు విశ్వనాథుడు, శక్తిపీఠం విశాలాక్షి ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో కొలువై ఉన్నారు. అలాగే జ్యోతిర్లింగ స్వరూపుడు మహాకాళేశ్వరుడు, శక్తిపీఠం మహాకాళి దేవి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉజ్జయినీలో కొలువై ఉన్నారు. కానీ వేరు వేరు ప్రదేశాల్లో వీరు కొలువై ఉన్నారు.

స్వామివారి ఆలయం ఒకచోట, అమ్మవారి ఆలయం మరోకచోట ఉంటుంది. శ్రీశైలంలో మాత్రమే మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి ఒకే ఆలయ ప్రాంగాణంలో కొలువై ఉన్నారు. దీంతో ఈ క్షేత్రం అత్యంత మహిమానిత్య క్షేత్రంగా పేరొందింది. భక్తులు కూడా ఒకే ఆలయ ప్రాంగాణంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠం కొలువై ఉండడంతో మహాశక్తిగా, మహిమానిత్యంగా భావించి వేల సంఖ్యలో తరలివచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తుల కొరిన కొర్కెలు తీర్చే స్వామి అమ్మవార్లుగా ఈ క్షేత్రం ప్రసిద్ది చెందింది. ఈ క్షేత్ర సందర్శననకు భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు