రాళ్ల  వర్షం కురిసిందట.. ఆ ఊరిలో పొలాల నిండా రాళ్లే

11 Oct, 2021 12:30 IST|Sakshi

గ్రామానికి కిలోమీటరు చుట్టూ పొలాల్లో రాళ్లే

రాళ్లలోనే పంటసాగు

వైఎస్సార్‌ జిల్లా (జమ్మలమడుగు): జమ్మలమడుగు పట్టణానికి తూర్పు దిశగా ఐదు కిలోమీటర్ల దూరంగా ఉన్న చిన్న గ్రామమైన రాళ్లగుళ్లకుంట ప్రత్యేకత చాటుకుంది. కేవలం గ్రామానికి కిలోమీటరు చుట్టూ మాత్రమే పొలాల నిండా రాళ్లుతో నిండిపోయి ఉంటుంది. ఈ రాళ్లలోనే రైతులు భూమిని దున్ని పంటలను సాగుచేస్తున్నారు.  కేవలం గ్రామానికి కిలోమీటరు చుట్టూ రాళ్లు ఉండటం ఈ గ్రామానికి ప్రత్యేకత తీసుకుని వచ్చింది.

గ్రామానికి చుట్టూ కిలోమీటరు దూరం వరకు ఉన్న పొలాల్లో రాళ్లు మాత్రమే కనిపిస్తాయి తప్ప భూమి ఎక్కడ కనిపించదు. కిలోమీటరు దాటిన తర్వాత పూర్తిగా నల్లరేగటి భూమిలే. రాళ్లు ఎక్కువగా ఉండటంతో ఈ గ్రామానికి రాళ్ల గుల్లకుంటగా గుర్తింపు తీసుకుని వచ్చింది. ఈ గ్రామానికి మరో పేరు శేషారెడ్డిపల్లె.

రాళ్లవర్షం కురిసిందంటా...
త్రేతా యుగంలో గ్రామం చుట్టూ పరిసరా ప్రాంతాలలో రాళ్ల వర్షం పడ్డాయని గ్రామస్థులు కథలు చెబుతున్నారు. భూమిలోరాళ్లు ఎక్కువ ఉండటంతో రైతులు మొదట్లో రాళ్లను తొలగించే ప్రయత్నం చేశారు. భూమిని దున్నుతున్న ప్రతి సారి భూమిలో నుంచి రాళ్లు ఎక్కువగా వస్తుండటంతో శ్రమంతా నిరుపయోగం అవుతుండటంతో రాళ్లును తొలగించే ప్రయత్నం మానుకున్నారు.

అయితే ఈ రాళ్లు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. గ్రామంలో చుట్టూప్రక్కల భూములన్ని వర్షాధార ఆధారంగా పంటలను సాగుచేస్తున్నారు. అయితే వర్షాలు తక్కువగా పడిన సమయంలో భూమిలో రాళ్లు ఉండటంతో  ఆ రాళ్ల చల్లదనానికి పంటలు ఎండకుండ కాస్త దిగుబడి ఎక్కువగా వస్తుందని రైతులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు