ఈ రాశి వారు శుభవార్త వింటారు, కొత్త పరిచయాలు

3 Apr, 2024 06:51 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.నవమి ప.1.53 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: ఉత్తరాషాఢ సా.5.42 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: రా.9.31 నుండి 10.59 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.27 వరకు,

అమృత ఘడియలు: ప.11.31 నుండి 1.04 వరకు;
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు,
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు,
సూర్యోదయం: 5.58,
సూర్యాస్తమయం: 6.09. 

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి,వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

కర్కాటకం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు.

సింహం: ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కన్య: వ్యవహారాలలో నిరుత్సాహం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణయత్నాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.

వృశ్చికం: రుణయత్నాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. అదనపు బాధ్యతలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహనయోగం.

మకరం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన.

కుంభం: నూతన ఉద్యోగయోగం. పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం: నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. 

Election 2024

మరిన్ని వార్తలు