ఈ రాశివారికి సన్నిహితులతో సఖ్యత

1 Aug, 2021 06:19 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి.బ.అష్టమి ఉ.8.15 వరకు, తదుపరి నవమి, నక్షత్రం భరణి రా.8.41 వరకు, తదుపరి కృత్తిక వర్జ్యం... లేదు, దుర్ముహూర్తం సా.4.47 నుండి 5.38 వరకు అమృతఘడియలు... ప.3.23 నుండి 5.04 వరకు.

సూర్యోదయం :  5.42
సూర్యాస్తమయం  :  6.31
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

వృషభం... పనుల్లో కొంత జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. సోదరులతో కలహాలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం... సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల సహకారం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం... సన్నిహితులతో సఖ్యత. కుటుంబసమస్యలు తీరతాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

సింహం... పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య... కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

తుల... పూర్వపు మిత్రుల కలయిక. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం... సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు విస్తృతమవుతాయి. దైవదర్శనాలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

ధనుస్సు... పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

మకరం... వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. సోదరులతో కలహాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కుంభం... సన్నిహితుల నుంచి కీలక సమాచారం. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మీనం... వ్యవహారాలు నిదానిస్తాయి. అనుకోని ప్రయాణాలు. భూవివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మరిన్ని వార్తలు