ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి

2 Apr, 2021 06:30 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి బ.పంచమి ప.1.36 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం అనూరాధ ఉ.10.23 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం ప.3.37 నుంచి 5.09 వరకు, దుర్ముహూర్తం ఉ.8.23 నుంచి 9.11 వరకు, తదుపరి ప.12.26 నుంచి 1.15 వరకు అమృతఘడియలు... రా.12.45 నుంచి 2.05 వరకు.

సూర్యోదయం :    5.59
సూర్యాస్తమయం    :  6.08
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

దినఫలాలు:
మేషం... పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం... బంధువులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం. ఆస్తిలాభం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం... వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. భూ, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు అధిమిస్తారు.

కర్కాటకం... ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

సింహం... వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కన్య... ఆదాయం పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శ్రమ ఫలిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

తుల... కొత్త రుణాలు చేస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. కాంట్రాక్టులు దక్కుతాయి. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృశ్చికం... పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో ప్రగతి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు... రుణదాతల ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మకరం... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. కుటుంబంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

కుంభం... సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మీనం... బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మరిన్ని వార్తలు