గ్రహం అనుగ్రహం (03-08-2020)

3 Aug, 2020 05:59 IST|Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, వర్ష ఋతువు. శ్రావణ మాసం. తిథి పౌర్ణమి రా.8.45 వరకు, తదుపరి బ.పాడ్యమి. నక్షత్రం ఉత్తరాషాఢ ఉ.7.45 వరకు, తదుపరి శ్రవణం. వర్జ్యం ప.11.50 నుంచి 1.24 వరకు. దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.21 వరకు, తిరిగి ప.3.03 నుంచి 3.53 వరకు.  అమృత ఘడియలు రా.9.37 నుంచి 11.15 వరకు

రాఖీ పండగ
సూర్యోదయం: 5.42 సూర్యాస్తమయం: 6.30; 
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. 
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

గ్రహఫలం
మేషం....నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం....ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మిథునం...కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం....నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం......సోదరులతో సఖ్యత. నిరుద్యోగులకు శుభవార్తలు.. కార్యజయం. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కన్య.....ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల.....మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం...కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. ఆలయ దర్శనాలు. ఆస్తిలాభం. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు....రుణాలు చేస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం....పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. మిత్రులు, బంధువుల కలయిక.వస్తులాభాలు.  వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.

కుంభం....వ్యవహారాలలో అవరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

మీనం...ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం.. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు