గ్రహం అనుగ్రహం (04-09-2020)

4 Sep, 2020 06:37 IST|Sakshi

శ్రీ శార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి బ.విదియ ప.12.16 వరకు, తదుపరి తదియ, నక్షత్రం ఉత్తరాభాద్ర రా.10.36 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం ఉ.6.50 నుంచి 8.34 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.04 వరకు, తదుపరి ప.12.23 నుంచి 1.12 వరకు, అమృతఘడియలు...సా.5.20 నుంచి 7.06 వరకు

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.10
రాహుకాలం :  ప. 10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ఉ.3.00 నుంచి 4.30 వరకు

మేషం : ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. కళాకారులకు ఒడిదుడుకులు.

వృషభం : కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. 

మిథునం : నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు.  ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. .

కర్కాటకం : ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. దైవకార్యాలలో పాల్గొంటారు.

సింహం : బాధ్యతలు పెరుగుతాయి. ఇంటాబయటా చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. .

కన్య : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. కళాకారులకు నూతనోత్సాహం.

తుల : కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.  కళాకారులకు ప్రోత్సాహం. 

వృశ్చికం : బంధువిరోధాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. కళాకారులకు చిక్కులు.

ధనుస్సు : వ్యయప్రయాసలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. బంధువులతో స్వల్ప వివాదాలు.

మకరం : నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. దైవదర్శనాలు. విలువైన సమాచారం. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. 

కుంభం : మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి. శ్రమ మరింత పెరుగుతుంది.

మీనం : పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగులకు పదోన్నతులు. ఆలోచనలు అమలు చేస్తారు. 

మరిన్ని వార్తలు