గ్రహం అనుగ్రహం(04-10-2020)

4 Oct, 2020 06:24 IST|Sakshi

గ్రహం అనుగ్రహం

శ్రీశార్వరినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు అధిక ఆశ్వయుజ మాసం తిథి బ.తదియ పూర్తి(24గంటలు) నక్షత్రం అశ్వని ఉ.10.48 వరకు తదుపరి భరణి వర్జ్యం ఉ.6.20 నుంచి 8.07 వరకు తిరిగి  రా.9.23 నుంచి 11.10 వరకు దుర్ముహూర్తం సా.4.10 నుంచి 4.57 వరకు అమృతఘడియలు..లేవు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు

సూర్యోదయం 5.54
సూర్యాస్తమయం 5.46

రాశిఫలం:
మేషం: శుభకార్యాలకు ప్రణాళిక రూపొందిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు దిగ్విజయంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు..

వృషభం: పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. ధనవ్యయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

కర్కాటకం: కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. బంధువులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

సింహం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త చికాకు పరుస్తాయి.

కన్య: శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల: శ్రమకు ఫలితం దక్కుతుంది. ఊహించని రీతిలో పాతమిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు..

వృశ్చికం: పాతబాకీలు వసూలవుతాయి. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది.  భూ, గృహయోగాలు. ప్రముఖుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ధనుస్సు: రుణాల వేటలో పడతారు. దూరప్రయాణాలు. శ్రమ మరింత పెరుగుతుంది. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు..

కుంభం: మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. వస్తులాభాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మీనం: బంధువులతో అకారణంగా విభేదాలు. ధనవ్యయం. పనుల్లో అవాంతరాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
 

మరిన్ని వార్తలు