గ్రహం అనుగ్రహం (04-12-2020) 

4 Dec, 2020 06:35 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.చవితి సా.5.34 వరకు, తదుపరి పంచమి నక్షత్రం పునర్వసు ప.12.14 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం రా.8.20 నుంచి, 9.58 వరకు. దుర్ముహూర్తం ఉ.8.30 నుంచి 9.14 వరకు తదుపరి ప.12.10 నుంచి 12.54 వరకు, అమృతఘడియలు...ఉ.9.44 నుంచి 11.24 వరకు.

సూర్యోదయం :    6.19
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలలో అవాంతరాలు. రుణాలు చేయాల్సిన పరిస్థితి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి.

వృషభం: పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు చకచకా సాగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

మిథునం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. వ్యాపార విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కర్కాటకం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు వృద్ధి బాటలో  నడుస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

సింహం: అనుకున్న వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. 

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆర్థిక వ్యవహారాలలో కొంత పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలమైన పరిస్థితి.

తుల: నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలించవు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితి.

ధనుస్సు: రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు వాయిదా. ఉద్యోగాలలో వివాదాలు.

మకరం: కొత్త పనులు చేపడతారు. పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలలో మార్పులు. స్వల్ప అనారోగ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  అనుకూల పరిస్థితులు.

కుంభం: వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. భూలాభాలు. ప్రముఖుల కలయిక. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

మీనం: అనుకున్న పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. ఇంటినిర్మాణాల్లో అవాంతరాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

మరిన్ని వార్తలు