గ్రహం అనుగ్రహం (05-08-2020)

5 Aug, 2020 05:57 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.విదియ రా.9.34 వరకు, తదుపరి తదియ, నక్షత్రం ధనిష్ఠ ఉ.9.23 వరకు, తదుపరి శతభిషం వర్జ్యం సా.5.03 నుంచి 6.47 వరకు దుర్ముహూర్తం ప.11.39 నుంచి 12.30 వరకు అమృతఘడియలు... రా.3.19 నుంచి 5.01 వరకు.

సూర్యోదయం :    5.43
సూర్యాస్తమయం    :  6.29
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

దినఫలాలు
మేషం...కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు.  వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి. 

వృషభం..కొత్త వ్యక్తుల పరిచయం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆశించిన రాబడి కనిపిస్తుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు శుభవార్తలు. 

మిథునం..ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో  చికాకులు. బంధువులతో అకారణ వైరం. అంచనాలు తారుమారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు మరింత  పనిభారం. పారిశ్రామికవర్గాలకు సమస్యలు ఎదురవుతాయి.

కర్కాటకం...ఆదాయం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు ఉండవచ్చు. నేత్ర సంబంధిత రుగ్మతలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

సింహం...కొత్త కార్యక్రమాలు  చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు.  వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకున్న హోదాలు దక్కుతాయి.  

కన్య....ప్రత్యర్థులు సైతం స్నేహితులుగా మారతారు.  భూములు, స్థలాలు కొనుగోలు యత్నాలు  కలిసివస్తాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు. 

తుల...రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల సంబంధించిన చికాకులు.  వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు బదిలీ సూచనలు. కళాకారులకు చికాకులు.

వృశ్చికం...అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. భూ వివాదాలు నెలకొంటాయి. రాబడి కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగులకు చికాకులు. 

ధనుస్సు....నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.  వాహనాలు, ఆభరణాలు కొంటారు.  దేవాలయ దర్శనాలు.  వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. 

మకరం...కుటుంబ సమస్యలు.  దూరప్రయాణాలు. స్నేహితులతో విభేదాలు. అనారోగ్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగులకు మార్పులు. 

కుంభం...ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి.  ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.  ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఉన్నత హోధాలు. 

మీనం...కార్యక్రమాలలో అవాంతరాలు. ఆస్తి విషయాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.  వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు. 

మరిన్ని వార్తలు