ఈ రాశివారికి అనుకోని ధనవ్యయం

5 Aug, 2021 06:25 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి బ.ద్వాదశి ప.3.54 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం ఆరుద్ర పూర్తి (24 గంటలు), వర్జ్యం ఉ.1,22 నుండి 3.06  వరకు, దుర్ముహూర్తం ఉ.9.57 నుండి 10.48 వరకు, తదుపరి ప.3.05 నుండి 3.56 వరకు అమృతఘడియలు... రా.7.23 నుండి 9.08 వరకు.

సూర్యోదయం :    5.43
సూర్యాస్తమయం    :  6.29
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. వ్యాపారాలు
అనుకూలిస్తాయి.

వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. కష్టం ఫలించదు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.. ఆకస్మిక ప్రయాణాలు.

మిథునం: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు.  కొత్త పనులు చేపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆటుపోట్లు. ఆస్తుల వివాదాలు.

సింహం: ఆశించిన విధంగా పనులు పూర్తి. ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూలం. వాహనయోగం.

కన్య: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. ధనలబ్ధి. వాహనయోగం.  వ్యాపారాలు,  ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

తుల: కొత్తగా రుణాలు  చేస్తారు. మానసిక అశాంతి. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు భారంగా మారతాయి. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.

వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలలో చికాకులు.  కుటుంబంలో చికాకులు. మానసిక ఆందోళన. ఆస్తి వివాదాలు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ఆరోగ్యసమస్యలు.

ధనుస్సు: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూలం. 

మకరం: నిరుద్యోగులకు సానుకూలం. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు.  ఆకస్మిక ధనలబ్ధి. కుటుంబంలో  శుభకార్యాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విరోధాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు జరిగే అవకాశం.

మీనం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. మానసిక వేదన. ఆరోగ్య సమస్యలు.  ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో చిక్కులు.
 

మరిన్ని వార్తలు