గ్రహం అనుగ్రహం (05-12-2020) 

5 Dec, 2020 06:15 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.పంచమి సా.5.12 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం పుష్యమి ప.12.35 వరకు, తదుపరి ఆశ్లేష వర్జ్యం రా.1.17 నుంచి 2.54 వరకు దుర్ముహూర్తం ఉ.6.20 నుంచి 7.47 వరకు అమృతఘడియలు... ఉ.6.22 నుంచి 7.43 వరకు.

సూర్యోదయం :    6.20
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: స్నేహితులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు నెమ్మదిగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

వృషభం: పనులు అనుకున్నరీతిలో సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

సింహం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కన్య: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

తుల: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు సహకరిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

వృశ్చికం: నిరుద్యోగులకు శ్రమాధిక్యం. పనులు మందకొడిగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.

ధనుస్సు: రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. అనుకున్న వ్యవహారాలలో ప్రతిబంధకాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

మకరం: వ్యూహాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. భూలాభాలు. పాతమిత్రుల కలయిక. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

కుంభం: కొన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. ఆస్తిలాభం. నూతన పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

మీనం: కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మరిన్ని వార్తలు