ఈ రాశివారికి కాంట్రాక్టులు లభిస్తాయి

6 Apr, 2021 06:29 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి బ.దశమి తె.5.03 వరకు (తెల్లవారితే బుధవారం) తదుపరి ఏకాదశి, నక్షత్రం శ్రవణం తె.5.22 వరకు (తెల్లవారితే బుధవారం), తదుపరి ధనిష్ఠ, వర్జ్యం ఉ.9.38 నుండి 11.12 వరకు, దుర్ముహూర్తం ఉ.8.21 నుండి 9.10 వరకు, తదుపరి రా.10.51 నుండి 11.38 వరకు, అమృతఘడియలు... రా.7.06 నుంచి 8.40 వరకు.

సూర్యోదయం :    5.55
సూర్యాస్తమయం    :  6.10
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు:

మేషం: ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాల వృద్ధి. ఉద్యోగాలలో ఉత్సాహం.

వృషభం: అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాల యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మిథునం: వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కర్కాటకం: మిత్రులతో మరింత సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో ఆదరణ. విద్యార్థులకు అనుకూలస్థితి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువులతో విభేదాలు. ధనవ్యయం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. వాహనాలు కొంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభం. ఉద్యోగాలలో హోదాలు.

ధనుస్సు: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మకరం: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. వాహనసౌఖ్యం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు.

కుంభం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో అనుకూలత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మరిన్ని వార్తలు