గ్రహం అనుగ్రహం (06-10-2020)

6 Oct, 2020 06:23 IST|Sakshi

    గ్రహం అనుగ్రహం

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు అధిక ఆశ్వయుజ మాసం, తిథి బ.చవితి ఉ.9.05 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం కృత్తిక ప.3.40 వరకు, తదుపరి రోహిణి వర్జ్యం... లేదు, దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి 9.04 వరకు తదుపరి రా.10.35 నుంచి 11.23 వరకు అమృతఘడియలు... ప.10.01 నుంచి 2.46 వరకు.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  5.44
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశిఫలం:
మేషం: పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పనిభారం.

వృషభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం: శ్రమ తప్పదు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కర్కాటకం: క్రమపద్ధతిలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

సింహం: కార్యజయం. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశిష్ఠ గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటుంది.

కన్య: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు.

తుల: బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు.

వృశ్చికం: ఆప్తుల నుంచి  ముఖ్య సమాచారం. కార్యసిద్ధి. ఖ్యాతి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు ఆశావహంగా సాగుతాయి..

ధనుస్సు: ఊహించని ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. . పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

మకరం: పనుల్లో ఆటంకాలు. బంధువులతో వివాదాలు. శ్రమకు  ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు ఎదురవుతాయి.

కుంభం: మిత్రులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. ఊహించని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి..

మీనం: మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.
 

మరిన్ని వార్తలు