ఈ రాశివారికి ఉద్యోగాల్లో చికాకులు

7 Apr, 2021 06:16 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి బ.ఏకాదశి తె.4.28 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి ద్వాదశి, నక్షత్రం ధనిష్ఠ తె.5.30 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి శతభిషం, వర్జ్యం ఉ.9.22 నుండి 10.58 వరకు, దుర్ముహూర్తం ప.11.36 నుండి 12.27 వరకు, అమృతఘడియలు... రా.7.00 నుంచి 9.36 వరకు.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  6.10
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు: 

మేషం: ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆర్థికాభివృద్ధి. ఉద్యోగాన్వేషణలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

మిథునం: సోదరులతో విభేదాలు. ఆర్థికంగా ఇబ్బందులు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: సమస్యల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ధనలబ్ధి. పరిచయాలు విస్తృతమవుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

సింహం: కార్యజయం. ఆస్తిలాభం. రాబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశ్చర్యకర మార్పులు.

కన్య: రుణబాధలు తప్పవు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల: కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. కాంట్రాక్టులు చేజారవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికం: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ధనుస్సు: బంధువర్గంతో తగాదాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. భూలాభాలు. నూతన ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: మిత్రుల నుంచి దనలబ్ధి. నూతన వ్యక్తుల పరిచయం. భూవివాదాల పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
 

మరిన్ని వార్తలు