గ్రహం అనుగ్రహం (07-08-2020)

7 Aug, 2020 06:02 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుశ్రావణ మాసం, తిథి బ.చవితి రా.12.16 వరకు, తదుపరి పంచమి నక్షత్రం పూర్వాభాద్ర ప.1.04 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం రా.11.36 నుంచి 1.21 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి9.06 వరకు, తిరిగి ప.12.30 నుంచి 1.21 వరకు అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం :    5.43
సూర్యాస్తమయం    :  6.29
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

గ్రహఫలం
మేషం....వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

వృషభం...పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

మిథునం...సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది.

కర్కాటకం...శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

సింహం....వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ప్రయాణాలు రద్దు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి.

తుల...శుభవర్తమానాలు. రావలసిన సొమ్ము అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృశ్చికం...సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలలో నిరాశ.

ధనుస్సు....అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. కొన్ని పనులలో ఆటంకాలు. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

మకరం....నూతన పరిచయాలు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలు సంతృప్తినిస్తాయి. 

కుంభం....వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు చేస్తారు. సోదరులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం....సోదరుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తులు సమకూరతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.

మరిన్ని వార్తలు