గ్రహం అనుగ్రహం (08-08-2020)

8 Aug, 2020 06:15 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.పంచమి రా.2.04 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర ప.3.25 వరకు, తదుపరి రేవతి వర్జ్యం తె.4.47 నుంచి 6.29 వరకు (తెల్లవారితే ఆదివారం)దుర్ముహూర్తం 5.44 నుంచి 7.23 వరకుఅమృతఘడియలు... ఉ.10.11 నుంచి 11.54 వరకు.

సూర్యోదయం :    5.44
సూర్యాస్తమయం    :  6.28
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

గ్రహఫలం
మేషం....విశేషంగా పేరుగడిస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి. ఆత్మీయులతో చర్చలు జరుపుతారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

వృషభం...సన్నిహితులు, మిత్రులు మీపట్ల వ్యతిరేకత చూపుతారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

మిథునం...పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా గడుపుతారు.

కర్కాటకం....శ్రమ తప్పదు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

సింహం....పనులు ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు. ధన, వస్తులాభాలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కన్య....విచిత్ర సంఘటనలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

తుల...వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటుంది.

వృశ్చికం....శ్రమ పెరిగినా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. సోదరులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన విధంగా ఉంటాయి.

మకరం...బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ధనలబ్ధి. నూతన ఒప్పందాలు. ఆత్మీయులతో సఖ్యత. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ అనుభవాలను చాటుకుంటారు.

కుంభం...పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు తప్పవు. వ్యాపారాల విస్తరణ నిలిపివేస్తారు. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.

మీనం...సన్నిహితులతో కలహాలు. రుణయత్నాలు సాగిస్తారు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

>
మరిన్ని వార్తలు