గ్రహం అనుగ్రహం (08-11-2020)

8 Nov, 2020 06:27 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, నిజ ఆశ్వయుజ మాసం, తిథి బ.అష్టమి రా.1.20 వరకు తదుపరి నవమి, నక్షత్రం ఆశ్లేష తె.4.31 వరకు (తెల్లవారితే సోమవారం), తదుపరి మఖ,వర్జ్యం సా.5.23 నుంచి 6.59 వరకు దుర్ముహూర్తం సా.3.52 నుంచి 4.37 వరకు, అమృతఘడియలు... రా.2.55 నుంచి 4.30 వరకు.

సూర్యోదయం        :  6.05
సూర్యాస్తమయం    :  5.24
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: కుటుంబసభ్యులతో వివాదాలు. సహనానికి పరీక్షాసమయం. పనులు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం: ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. భూ, గృహయోగాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కార్యజయం..

మిధునం: పనులు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. బంధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ మార్పులు.

కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు తీరతాయి. మీ ప్రయత్నాలకు కుటుంబసభ్యుల చేయూత. ఆకస్మిక ధనలబ్ధి. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

సింహం: చేపట్టిన పనులు  నత్తనడకన సాగుతాయి. బంధువులు, మిత్రులు ఒత్తిడులు పెంచుతారు. నిరుద్యోగుల కృషి ఫలించదు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో బాధ్యతలు అధికం.

కన్య: సంఘంలో గౌరవమర్యాదలు. ఆలయాలు సందర్శిస్తారు. భూ, గృహయోగాలు.  ఉద్యోగాల్లో కొత్త ఆశలు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. వస్తు, వస్త్రలాభాలు.

తుల: పనులలో విజయం. శుభకార్యాల్లో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: కుటుంబంలో ఒత్తిడులు. ఉద్యోగ, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. అనుకోని సంఘటనలు. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలలో మార్పులు.

మకరం: ఆటంకాలు అధిగమించి పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కుంభం: సోదరులతో వివాదాలు తీరతాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. దైవదర్శనాలు. సంఘంలో విశేష గౌరవం. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మీనం: వ్యవహారాల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
 

మరిన్ని వార్తలు