ఈ రాశివారు ఆస్తులు కొనుగోలు చేస్తారు

9 Aug, 2021 06:19 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.పాడ్యమి రా.7.01 వరకు, తదుపరి విదియ నక్షత్రం ఆశ్లేష ఉ.10.36 వరకు, తదుపరి మఖ, వర్జ్యం రా.10.46 నుండి 12.23 వరకు, దుర్ముహూర్తం ప.12.31 నుండి 1.22 వరకు తదుపరి ప.3.04 నుండి 3.54 వరకు అమృతఘడియలు... ఉ.8.56 నుండి 10.33 వరకు.

సూర్యోదయం :    5.44
సూర్యాస్తమయం    :  6.28
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు 

మేషం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిథునం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త అనుకూలిస్తాయి.

కర్కాటకం: ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమానంతరం పనులు పూర్తి. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మందగిస్తుంది.  నిరుద్యోగుల యత్నాలు ఫలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. రాబడి సంతృప్తినిస్తుంది. వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

వృశ్చికం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యావకాశాలు దక్కుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు.

మకరం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మరిన్ని వార్తలు