ఈ రాశివారికి ఇంటాబయటా సమస్యలు

1 Feb, 2021 06:48 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత రుతువు; పుష్య మాసం;బహుళ పక్షం చవితి: రా. 8-24 తదుపరి పంచమి ఉత్తర: రా. 2-09 తదుపరి హస్త వర్జ్యం: ఉ. 10-05 నుంచి 11-37 వరకు అమృత ఘడియలు: రా. 7-15 నుంచి 8-47 వరకు దుర్ముహూర్తం: మ. 12-36 నుంచి 1-21 వరకు తిరిగి 2-51 నుంచి 3-36 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు 

సూర్యోదయం: ఉ.6-36
సూర్యాస్తమయం: సా.5-51
సంకట హర చతుర్థి

రాశిఫలాలు: 
మేషం: ఉద్యోగయత్నాలు సానుకూలం. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ఆహ్వానాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కర్కాటకం: కొత్త పనులు ప్రారంభం. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

సింహం: కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య: కొత్త విషయాలు తెలుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

తుల: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగులకు పనిభారం.

కుంభం: కుటుంబంలో చికాకులు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
 

మరిన్ని వార్తలు