ఈ రాశివారి ఆశలు ఫలిస్తాయి

1 Mar, 2021 06:10 IST|Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. ఉత్తరాయణం, శిశిర ఋతువు. మాఘ మాసం. తిథి బ.విదియ ఉ.11.11 వరకు, తదుపరి తదియ. నక్షత్రం ఉత్తర ఉ.10.11 వరకు, తదుపరి హస్త. వర్జ్యం సా.6.06  నుండి 7.36  వరకు. దుర్ముహూర్తం ప.12.36 నుండి 1.22 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.41 వరకు. అమృత ఘడియలు రా.3.11 నుంచి 4.44 వరకు

సూర్యోదయం 6.23
సూర్యాస్తమయం 6.01
యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు
రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి.  సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మెరుగ్గా ఉంటాయి.

వృషభం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్య భంగం. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు.

మిథునం: రుణయత్నాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యయప్రయాసలు. ఇంటాబయటా సమస్యలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. కళాకారులకు నిరాశాజనకంగా ఉంటుంది

కర్కాటకం: పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. వస్తులాభాలు. ప్రముఖుల నుంచి కీలక సందేశం.దైవదర్శనాలు. ఉద్యోగలాభం.

సింహం: కొన్ని పనులు వాయిదా. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు.  స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కన్య: కొత్త పనులు చేపడతారు. దైవదర్శనాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. స్థిరాస్తి వృద్ధి.

తుల: శ్రమ పెరుతుంది. సన్నిహితులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని చిక్కులు. దూరపు బంధువులను కలుసుకుంటారు. కళాకారుల యత్నాలు ముందుకు సాగవు.

వృశ్చికం: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్య సమాచారం. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. దైవచింతన.

మకరం: సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం: మిత్రులతో తగాదాలు. ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని అవాంతరాలు.

మీనం: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వస్తులాభాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

 
 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు