గ్రహం అనుగ్రహం (10-08-2020)

10 Aug, 2020 06:42 IST|Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, వర్ష ఋతువు. శ్రావణ మాసం. తిథి బ.సప్తమి పూర్తి (24గంటలు). నక్షత్రం అశ్వని రా.8.34 వరకు, తదుపరి భరణి. వర్జ్యం సా.4.11 నుంచి 5.55 వరకు. దుర్ముహూర్తం ప.12.31 నుంచి 1.20 వరకు, తదుపరి 3.02 నుంచి 3.54 వరకు. అమృత ఘడియలు ప.12.37 నుంచి 2.23 వరకు

సూర్యోదయం: 5.45 సూర్యాస్తమయం: 6.26; 
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. 
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

గ్రహఫలం
మేషం...బంధుమిత్రుల నుంచి ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

వృషభం...కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. దైవదర్శనాలు.

మిథునం... బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కర్కాటకం...మిత్రులతో ఆనందంగా గడుపుతారు.  పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ, విద్యావకాశాలు. ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

సింహం...మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మికప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. నిరుద్యోగుల యత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య.....పనుల్లో  అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. మిత్రులతో అకారణంగా విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల....ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. కొన్ని బాకీలు కూడా వసూలవుతాయి. భూ«,ధనలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం....ఒక సమాచారం ఊరటనిస్తుంది. వస్త్రలాభాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన,గృహయోగాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనిభారం తొలగుతుంది.

ధనుస్సు...రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

మకరం...శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కుంభం..ఉద్యోగావకాశాలు. చేపట్టిన కార్యక్రమాలలో విజయం. ప్రముఖులతో పరిచయాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం

మీనం...పనులలో కొన్ని ఆటంకాలు. బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. శ్రమ మరింత తప్పదు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. 

మరిన్ని వార్తలు