ఈ రాశివారికి బాధ్యతలు పెరుగుతాయి

10 Aug, 2021 06:23 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.విదియ సా.6.13 వరకు, తదుపరి తదియ నక్షత్రం మఖ ఉ.10.59 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం సా.6.55 నుండి 8.31 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుండి 9.08 వరకు తదుపరి రా.10.58 నుండి 11.44 వరకు అమృతఘడియలు... ఉ.8.31 నుండి 10.36 వరకు.

సూర్యోదయం :    5.44
సూర్యాస్తమయం    :  6.27
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: పనుల్లో అవాంతరాలు. వృథా ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు.

వృషభం: దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కష్టానికి ఫలితం కనిపించదు. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మిథునం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహానిస్తాయి.

కర్కాటకం: శ్రమాధిక్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు ఫలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.

కన్య: రుణబాధలు తప్పవు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల: కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పలుకుబడి పెరుగుతుంది. పనులలో విజయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృశ్చికం: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. బంధువులను కలుసుకుంటారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.

ధనుస్సు: రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మకరం: పరిస్థితులు అనుకూలించవు. ఆస్తుల వివాదాలు నెలకొంటాయి. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మీనం: వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆస్తిలాభం. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
 

మరిన్ని వార్తలు