గ్రహం అనుగ్రహం (10-10-2020)

10 Oct, 2020 06:17 IST|Sakshi

శ్రీ శార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు అధిక ఆశ్వయుజ మాసం, తిథి బ.అష్టమి ప.12.26 వరకు తదుపరి నవమి, నక్షత్రం పునర్వసు రా.8.58 వరకు తదుపరి పుష్యమి, వర్జ్యం ఉ.8.33 నుంచి 10.11 వరకు దుర్ముహూర్తం ఉ.5.56 నుంచి 7.28 వరకు అమృతఘడియలు... సా.6.22 నుంచి 8.01 వరకు.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  5.40
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

రాశిఫలం:
మేషం: విద్యార్థులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. 

వృషభం: పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు ఒత్తిడులు పెంచుతారు. అనారోగ్యం. నిర్ణయాలు కొన్ని వాయిదా వేస్తారు.  వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన. 

మిథునం: వ్యవహారాలలో పురోగతి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. 

కర్కాటకం: బంధువుల నుంచి విమర్శలు. పనుల్లో తొందరపాటు. ధనవ్యయం. నిరుద్యోగులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

సింహం: శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం. సంఘంలో  పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.  వృత్తి, వ్యాపారాలలో చిక్కులు వీడతాయి.

కన్య: బంధువుల నుంచి కీలక సమాచారం. విద్యాయత్నాలు సానుకూలం.  ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.

తుల: బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమకు ఫలితం కనిపించదు.  కొన్ని పనులు హఠాత్తుగా విరమిస్తారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

వృశ్చికం: ముఖ్యమైన పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. మిత్రుల నుంచి ఒత్తిడులు.

ధనుస్సు: నూతన  కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. 

మకరం: చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. నూతన ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. 

కుంభం: కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. బంధువులతో విభేదాలు. పనులు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. 

మీనం: వ్యయప్రయాసలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు.ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి,వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. 

మరిన్ని వార్తలు