ఈ రాశివారికి వ్యాపారాలలో నిరాశ

10 May, 2021 06:19 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి బ.చతుర్దశి రా.9.20 వరకు, తదుపరి అమావాస్య  నక్షత్రం అశ్వని రా.8.11 వరకు, తదుపరి భరణి వర్జ్యం ప.3.46 నుంచి 5.33 వరకు, దుర్ముహూర్తం ప.12.21 నుంచి 1.10 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.45 వరకు, అమృతఘడియలు... ప.12.17 నుంచి 2.01 వరకు.

సూర్యోదయం :    5.34
సూర్యాస్తమయం    :  6.17
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు 

రాశి ఫలాలు: 

మేషం : సన్నిహితుల సాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు సేకరిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృషభం: కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఆదాయానికి మించిన ఖర్చులు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో కొత్త యత్నాలు విఫలం. ఆకస్మిక ప్రయాణాలు.

మిథునం: పడిన శ్రమ ఫలితమిస్తుంది. కొత్త పరిచయాలు. అదనపు రాబడి ఉంటుంది. చిరకాల మిత్రులను కలుస్తారు. ఉద్యోగాలు, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం: వ్యాపారాలలో ముందంజ. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం.  వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు.

సింహం: కుటుంబసభ్యుల నుంచి వ్యతిరేకత. రాబడి అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

కన్య: కార్యక్రమాలలో ఆటంకాలు. ఇంటాబయటా సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణదాతల ఒత్తిడులు. వ్యాపారాలలో నిరుత్సాహపడతారు. ఉద్యోగాలలో మార్పులు.

తుల: కొత్త పనులు చేపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో విజయాలు.

వృశ్చికం: సంఘంలో గౌరవమర్యాదలు. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో విశేష గుర్తింపు.

ధనుస్సు: దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో అకారణ వైరం. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో పనిభారం.

మకరం: కొత్తగా అప్పులు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. శారీరక రుగ్మతలు.

కుంభం: నూతన పరిచయాలు. దేవాలయ దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తి లాభం. యత్నకార్యసిద్ధి. గృహ నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

మీనం: ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో చిక్కులు. కార్యక్రమాలలో అవాంతరాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్య సమస్యలు. మిత్రుల నుంచి ఒత్తిడులు.

 

మరిన్ని వార్తలు