శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.తదియ సా.5.11 వరకు తదుపరి చవితి, నక్షత్రం పుబ్బ ఉ.10.48 వరకు తదుపరి ఉత్తర, వర్జ్యం సా.5.52 నుండి 7.25 వరకు దుర్ముహూర్తం ప.11.41 నుండి 12.31 వరకు అమృతఘడియలు... రా.3.14 నుండి 4.49 వరకు.
సూర్యోదయం : 5.45
సూర్యాస్తమయం : 6.26
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
మేషం: మిత్రులతో తగాదాలు. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమాలల్లో అవరోధాలు. కొన్ని విషయాలలో అంచనాలు తప్పుతాయి. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. ఉద్యోగాలలో చికాకులు.
మిథునం: ఉత్సాహంతో ముందుకు సాగుతారు. అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. అధిక రాబడి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం.
కర్కాటకం: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలలో అవరోధాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.
సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. ఆలయాలు సందర్శిస్తారు.
కన్య: ప్రయాణాలలో అవరోధాలు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఉద్యోగాలలో మార్పులు.
తుల: సోదరులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభం.యత్నకార్యసిద్ధి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృశ్చికం: నూతన ఉద్యోగప్రాప్తి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆదాయం పెరిగి అప్పులు తీరతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. దేవాలయ దర్శనాలు. విందువినోదాలు.
ధనుస్సు: పనుల్లో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కళాకారులకు నిరుత్సాహం. ఆరోగ్యసమస్యలు.
మకరం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. రాబడి తగ్గే అవకాశం. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కుంభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.కొద్దిపాటి ఆస్తిలాభం. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
మీనం: కుటుంబసౌఖ్యం. విలువైన సామగ్రి కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి పెంచుకుంటారు. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.