గ్రహం అనుగ్రహం (11-09-2020)

11 Sep, 2020 06:16 IST|Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి బ.నవమి రా.11.11 వరకు తదుపరి దశమి నక్షత్రం మృగశిర ఉ.11.54 వరకు తదుపరి ఆరుద్ర వర్జ్యం రా.8.38 నుంచి 10.19 వరకు దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి 9.04 వరకు తదుపరి ప.12.30 నుంచి 1.10 వరకు అమృతఘడియలు...రా.2.28 నుంచి 4.05 వరకు

సూర్యోదయం 5.50
సూర్యాస్తమయం 6.05
రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు

మేషం : కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొన్ని సమస్యలు, వివాదాలు తీరతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం : ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి.

మిథునం : ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం : పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తుంది.

సింహం : వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కన్య : నూతన ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థిక ప్రగతి ఉంటుంది. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. 

తుల : పనుల్లో ప్రతిష్ఠంభన. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు ఉండవచ్చు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం : ముఖ్య నిర్ణయాలు మార్చుకుంటారు. సోదరులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

ధనుస్సు : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి.

మకరం : వ్యవహారాలలో పురోగతి. ఆకస్మిక ధనలాభం. భూవివాదాలు పరిష్కారం. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

కుంభం : మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా మారవచ్చు.

మీనం : వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్య సమస్యలు. పనులలో జాప్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు