ఈ రాశివారి ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి

11 May, 2021 06:29 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువుచైత్ర మాసం, తిథి అమావాస్య రా.11.19 వరకు, తదుపరి వైశాఖ  శు.పాడ్యమి, నక్షత్రం భరణి రా.10.43 వరకు, తదుపరి కృతిక, వర్జ్యం ఉ.6.45 నుంచి 8.31 వరకు, దుర్ముహూర్తం ఉ.8.06 నుంచి 8.56 వరకు, తదుపరి రా.10.47 నుంచి 11.34 వరకు అమృతఘడియలు... సా.5.22 నుంచి 7.10 వరకు.

సూర్యోదయం :    5.34
సూర్యాస్తమయం    :  6.18
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు:
మేషం:వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు. పలుకుబడి పెరుగుతుంది. కార్యజయం. ఆస్తిలాభం. నూతన విద్యావకాశాలు.

వృషభం: కార్యక్రమాలలో  ప్రతిబంధకాలు. అప్పులు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యసమస్యలు.

మిథునం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ధనలబ్ధి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కర్కాటకం:నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. అనుకోని ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సా«ధిస్తారు.

సింహం: ఆదాయానికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

తుల: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. అందరిలోనూ గుర్తింపు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. 

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం: కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. అనారోగ్యం. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. చిత్రమైన సంఘటనలు.

కుంభం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పరిచయాలు. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. వస్తులాభాలు.

మీనం: దూరప్రయాణాలు ఉంటాయి. ధనవ్యయం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. పట్టుదలతో ముందుకు సాగండి.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు