గ్రహం అనుగ్రహం (12-08-2020)

12 Aug, 2020 05:28 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.అష్టమి ఉ.7.57 వరకు, తదుపరి నవమినక్షత్రం కృత్తిక రా.1.16 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం ప.12.11 నుంచి 1.54 వరకు, దుర్ముహూర్తం ప.11.40 నుంచి 12.31 వరకుఅమృతఘడియలు... రా.10.38 నుంచి 12.22 వరకు, గోకులాష్టమి.

సూర్యోదయం :    5.45
సూర్యాస్తమయం    :  6.25
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

గ్రహఫలం
మేషం....ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం....కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం దక్కుతుంది. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం....పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

కర్కాటకం....కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

సింహం....వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. స్థిరాస్తివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో ఆదరణ. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కన్య....మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

తుల...రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

వృశ్చికం....కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి.

ధనుస్సు....కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. చిత్రమైన సంఘటనలు. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

మకరం....వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

కుంభం....ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మీనం.....పనుల్లో పురోగతి. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు