గ్రహం అనుగ్రహం (12-12-2020) 

12 Dec, 2020 06:37 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.త్రయోదశి రా.2.30 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం విశాఖ రా.3.24 వరకు, తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.10.19 నుంచి 11.46 వరకు, దుర్ముహూర్తం ఉ.6.23 నుంచి 7.50 వరకు, అమృతఘడియలు... రా.7.13 నుంచి 8.44 వరకు, శనిత్రయోదశి.

సూర్యోదయం :    6.24
సూర్యాస్తమయం    :  5.23
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

రాశి ఫలాలు:

మేషం: పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. ఆస్తి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: దూరపు  బంధువులను కలుసుకుంటారు. వాహనయోగం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

తుల: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం.

వృశ్చికం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.

ధనుస్సు: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి.

మకరం: కుటుంబసమస్యలు తప్పవు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు కొన్ని మార్పులు.
 

మరిన్ని వార్తలు