ఈ రాశి వారికి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు..

12 Mar, 2021 06:12 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి బ.చతుర్దశి ప.2.44 వరకు, తదుపరి అమావాస్య నక్షత్రం శతభిషం రా.10.37 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం తె.5.21 నుండి 7.02 వరకు (తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం ఉ.8.36 నుండి 9.23 వరకు, తదుపరి ప.12.32 నుండి 1.20 వరకు, అమృతఘడియలు... ఉ.11.24 నుంచి 1.02 వరకు.

సూర్యోదయం :    6.15
సూర్యాస్తమయం    :  6.05
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: వ్యవహారాలలో విజయం. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృషభం: ముఖ్యమైన పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఆసక్తికర సమాచారం. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం. ప్రయాణాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కర్కాటకం: కొన్ని కార్యక్రమాలు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య: మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: రుణభారాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికం: ఖర్చులు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు.

మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం: మిత్రుల చేయూతతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో విశేషయోగదాయకం.

మీనం: సోదరులతో కలహాలు. ప్రయాణాలలో మార్పులు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

మరిన్ని వార్తలు