ఈ రాశివారికి అనుకోని ప్రయాణాలు

12 Jun, 2021 06:35 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.విదియ సా.6.11 వరకు, తదుపరి తదియ నక్షత్రం ఆరుద్ర ప.3.34 వరకు, తదుపరి పునర్వసు వర్జ్యం తె.4.23 నుండి 6.04 వరకు (తెల్లవారితే ఆదివారం) దుర్ముహూర్తం ఉ.5.29 నుండి 7.11 వరకు అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం: 5.28
సూర్యాస్తమయం:  6.30
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు

రాశి ఫలాలు:
మేషం: నూతన ఉద్యోగయోగం. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: మిత్రులతో మాటపట్టింపులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ఆధ్యాత్మిక చింతన.

మిథునం: కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార , ఉద్యోగాలలో పురోగతి.

కర్కాటకం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు. దూరప్రయాణాలు .

సింహం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహన, కుటుంబసౌఖ్యం. వృత్తి,వ్యాపారాలలో ముందడుగు.

తుల: రుణఒత్తిడులు. పనులలో కొద్దిపాటి ఆటంకాలు. అనుకోనిప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

వృశ్చికం: బంధువులతో మాటపట్టింపులు. రుణయత్నాలు. తీర్థయాత్రలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. .

ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మకరం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. ఒప్పందాల్లో ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. శ్రమకు ఫలితం అంతగా ఉండదు.

కుంభం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

మీనం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య భంగం. కుటుంబసభ్యులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు