ఈ రాశివారికి ఆకస్మిక ప్రయాణాలు

12 Jul, 2021 06:12 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి శు.విదియ ఉ.7.11 వరకు, తదుపరి తదియ నక్షత్రం ఆశ్లేష రా.2.47 వరకు, తదుపరి మఖ, వర్జ్యం ప.3.12 నుండి 4.53 వరకు, దుర్ముహూర్తం ప.12.30 నుండి 1.22 వరకు తదుపరి ప.3.06 నుండి 3.58 వరకు అమృత ఘడియలు రా.10.05 నుండి 2.45 వరకు.

సూర్యోదయం :    5.36
సూర్యాస్తమయం    :  6.35
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు 

మేషం: దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

వృషభం: బంధువులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. పనుల్లో విజయం. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

కర్కాటకం: పరిస్థితులు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. సంఘంలో గౌరవం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం. 

సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. భూవివాదాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగించవచ్చు.

కన్య: సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

తుల: ఉద్యోగయోగం. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

వృశ్చికం: మిత్రులు, బంధువులతో తగాదాలు. అనారోగ్యం. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వ్యయప్రయాసలు.

ధనుస్సు: కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

మకరం: కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందడుగు.

కుంభం: యత్నకార్యసిద్ధి. నూతనంగా చేపట్టిన పనులు పురోగతి. ఆస్తిలాభం. దైవదర్శనాలు. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు. 

మీనం: మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
 

మరిన్ని వార్తలు