గ్రహం అనుగ్రహం (13-10-2020)

13 Oct, 2020 06:20 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, అధిక ఆశ్వయుజ మాసం, తిథి బ.ఏకాదశి ఉ.9.56 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం మఖ రా.7.55 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం ఉ.8.15 నుంచి 9.48 వరకు తిరిగి తె.3.32 నుంచి 5.03 వరకు (తెల్లవారితే బుధవారం) దుర్ముహూర్తం ఉ.8.14 నుంచి 9.03 వరకు, తిరిగి రా.10.31 నుంచి 11.01 వరకు, అమృతఘడియలు... సా.5.34 నుంచి 7.02 వరకు.

సూర్యోదయం :    5.55
సూర్యాస్తమయం    :  5.38
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశిఫలం: 
మేషం: పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: శ్రమాధిక్యంతో పనులు పూర్తి. సోదరులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మిథునం: సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ఆస్తుల పురోగతి. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కర్కాటకం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి.

సింహం: పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యసాధన.

కన్య: బంధువర్గంతో మాటపడతారు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. పనుల్లో ప్రతిష్ఠంభన. ఆస్తుల వివాదాలు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

ధనుస్సు: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

మకరం: మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: సన్నిహితుల నుంచి ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మీనం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కుటుంబసమస్యల నుంచి ఊరట. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

మరిన్ని వార్తలు