గ్రహం అనుగ్రహం (13-11-2020) 

13 Nov, 2020 06:37 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, నిజ ఆశ్వయుజ మాసం, తిథి బ.త్రయోదశి సా.4.09 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం చిత్త రా.10.29 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం ఉ.7.31 నుంచి 9.03 వరకు, తదుపరి రా.3.40 నుంచి 5.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.20 నుంచి 9.05 వరకు, తదుపరి ప.12.05 నుంచి 12.52 వరకు అమృతఘడియలు... సా.4.29 నుంచి 5.59 వరకు.

సూర్యోదయం :    6.07
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

వృషభం: మిత్రులతో వివాదాలు. అనుకున్న ఉద్యోగావకాశాలు చేజారవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మిథునం: ద్యోగయత్నాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.

కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వస్తులాభాలు. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

సింహం: కొన్ని పనులు మధ్యలో వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలో అవాంతరాలు తొలగుతాయి. వస్తులాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.

తుల: బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం: ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కీలక సందేశం. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.

ధనుస్సు: కార్యజయం. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. ఆస్తిలాభం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

కుంభం: సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో జాప్యం. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మీనం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. విలువైన పత్రాలు జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.

మరిన్ని వార్తలు