ఈ రాశి వారికి పనుల్లో విజయం

13 Mar, 2021 06:02 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి అమావాస్య ప.3.10 వరకు, తదుపరి ఫాల్గుణ శు.పాడ్యమి, నక్షత్రం పూర్వాభాద్ర రా.11.48 వరకు తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం... లేదు దుర్ముహూర్తం ఉ.6.13 నుండి 7.47 వరకు అమృతఘడియలు... ప.3.24 నుంచి 5.04 వరకు.

సూర్యోదయం :    6.14
సూర్యాస్తమయం    :  6.05
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహనయోగం. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృషభం: ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

మిథునం: మిత్రుల నుంచి సమస్యలు. అనుకున్న పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు.

కర్కాటకం: బంధువులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

సింహం: కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. నూతన విద్యావకాశాలు. అప్రయత్న కార్యసిద్ధి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కన్య: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు. వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

తుల: ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

వృశ్చికం: ఏ పని చేపట్టినా నిరాశపరుస్తుంది. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

ధనుస్సు: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి లాభం. ఒక సమాచారం ఊరటనిస్తుంది. కుటుంబసమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు.

మకరం: ప్రయాణాలలో ఆటంకాలు. వ్యవహారాలు మందగిస్తాయి. ఒప్పందాలు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

కుంభం: మిత్రులు సహకరిస్తారు. పనుల్లో విజయం. భూయోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. నిరుద్యోగులకు అనుకూలం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

మీనం: అనుకున్న వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఒడిదుడుకులు.

మరిన్ని వార్తలు