ఈ రాశివారికి పనుల్లో అవాంతరాలు

14 Apr, 2021 06:22 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి శు.విదియ ఉ.10.43 వరకు, తదుపరి తదియ, నక్షత్రం భరణి ప.3.33 వరకు, తదుపరి కృత్తిక వర్జ్యం తె.4.51 నుండి ఉ.6.36 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం ప.11.35 నుండి 12.25 వరకు అమృతఘడియలు... ఉ.10.11 నుంచి 11.57 వరకు.

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.11
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

వృషభం: మిత్రుల నుంచి విమర్శలు. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మిథునం: కార్యజయం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. ఆలయ దర్శనాలు. సోదరుల కలయిక. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశలు ఫలిస్తాయి.

సింహం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణాలు చేస్తారు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో సాధారణంగా ఉంటాయి.

కన్య: రుణాలు చేయాల్సిన పరిస్థితి. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. కార్యజయం. భూవివాదాలు. సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవకాశాలు దక్కుతాయి.

వృశ్చికం: పెద్దల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. పనుల్లో గందరగోళం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

మకరం: కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు.

కుంభం: పనులలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. చర్చలు సఫలం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి.

మీనం: పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

మరిన్ని వార్తలు